రెండు వారాలు గా మీడియా లో ఎక్కడ చూసిన ఒకటే వార్త..అదే థాయ్‌లాండ్ గుహ గురించి. అవును గత రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ గుహలో పిల్లలు చిక్కుకున్న సంగతి తెల్సిందే. ఆ వార్త తెలిసిన దగ్గరినుండి ప్రపంచ మీడియా అంత ఈ గుహ పైనే పెట్టింది. గుహలో పిల్లలు ఎలా ఉన్నారో..అని వారంతా క్షేమంగా బయటకి రావాలని ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూచింది.
వీరంతా జూన్ 23 వ తేదీన సైక్లింగ్ చేసుకుంటూ గుహల దగ్గరకి వెళ్లే సరికి భారీ వర్షం రావడంతో గుహలోపలికి వెళ్లారు. అక్కడ ఆ ప్రాంతం మొత్తం నిండిపోవడంతో సురక్షితం ఉన్న చోటుకోసం అలా మూడు కిలోమీటర్లు వరకు వెళ్లిపోయారు. ఆ విధంగా గుహలో చిక్కుకుపోయిన పిల్లలను దశల వారీగా సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. ఆదివారం నాడు నలుగురిని ,సోమవారం నాడు నలుగురిని, ఈ రోజు మిగతా అందరిని సురక్షితంగా బయటకి తీసుకువచ్చినట్లు థాయ్ నేవీ సీల్స్ ధృవీకరించింది.