హరీష్ రావుకు అటెండర్ పోస్ట్..! : లోకేష్

nara-lokes-harish-rao-ktrతెదేపా వైఖరిపై అఖిల పక్ష సమావేశంలో తెరాస నేతలు చేస్తున్న విమర్శలకు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ దీటుగా స్పందించారు. తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే ఎన్టీఆర్ భవన్ లో అటెండర్ పని చేస్తానన్న హరీష్ రావు, తాను రాజీనామా చేస్తానన్న కె.రామారావుల వ్యాఖ్యలకు ఇప్పుడు సిద్ధమేనా అని లోకేశ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు. హరీష్ రావు నుంచి అటెండర్ పోస్టుకు దరఖాస్తు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కేటీఆర్ నుంచి రాజీనామా లేఖ ఆశిస్తున్నట్లు లోకేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇస్తే ఎన్టీఆర్ భవన్ లో అటెండర్ గా పనిచేస్తానంటూ ఈ ఏడాది జనవరి 13న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు, ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకుంటానంటూ ఫిబ్రవరి 19న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నారా లోకేశ్ ట్విట్టర్ లోసమాధానం ఇచ్చారు.