మరో అరుదైన రికార్డుకు చేరువలో ధోని

మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు చెప్పగానే అందరకీ ముందు గుర్తొచ్చేది మ్యాచ్ ముగింపు. ఎందుకంటే ఇప్పుడున్న క్రికెటర్లలో మ్యాచ్ ను ముగించడంలో ధోనీ తరువాతే ఎవరైనా. హెలికాఫ్టర్ షార్ట్ ను క్రికెట్ కు పరిచయం చేసింది ధోనీనే. ఇందంతా మనకు తెలిసిందే, కానీ ఇప్పుడు ధోనీ మరో అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అది ఈ రోజు జరగబోయే మ్యాచ్ తో ఆ రికార్డు నమోదు చేయబోతున్నాడు.

ఇప్పటి వరకు 500 మ్యాచ్ లు ఆ పైగా ఆడినవారిలో ముందుగా మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఒకటవ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. సచిన్ తరువాత స్థానంలో మహేలా జయవర్ధన ( శ్రీలంక , 652 మ్యాచ్‌లు ), సంగక్కర (శ్రీలంక, 594 మ్యాచ్‌లు), సనత్ జయసూర్య (శ్రీలంక, 586 మ్యాచ్‌లు), రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా, 560 మ్యాచ్‌లు), షాయిద్ ఆఫ్రిది (పాకిస్తాన్, 524 మ్యాచ్‌లు), జాక్వస్ కలీస్ (దక్షిణాఫ్రికా, 519 మ్యాచ్‌లు), మరియు రాహుల్ ద్రావిడ్ 509 మ్యాచ్‌లు ఆడారు

ఇప్పుడు ధోనీ 500 ల అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. బంగ్లాదేశ్‌తో 2004 లో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత శ్రీలంకతో 2005 లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు . దక్షిణాఫ్రికాతో 2006 లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు.

ధోని సారథ్యంలో ఇండియా కి 2007 లో టీ20 వరల్డ్ కప్, 2011 లో వరల్డ్ కప్ లు వచ్చాయి. 2014 లో ధోని టెస్ట్ లు నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.