సంపూకు జోడిగా రాజమౌళి హీరోయిన్..

‘హృదయ కాలేయం’ అనే చిత్రంతో సంచలన స్టార్ అయిన సంపూర్ణేష్ బాబు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తెర మీదకు రాబోతున్నాడు. కేవలం ఒకే ఒక చిత్రం తో అగ్ర నటుడికి ఎంతటి క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ తెచ్చుకున్న సంపూ..తాజాగా కొబ్బరిమట్ట అనే చిత్రంతో హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

జేజే ప్రకాష్ దర్శకత్వం లో సంపూ ఓ సినిమా చేస్తున్నాడు. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోనీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంపూ మహేష్ బాబు మూవీ టైటిల్‌ను వాడబోతున్నాడు. ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. అలీతో కలిసి అల్లరి పెళ్లికొడుకు చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్.. ఇప్పుడు సంపూతో సినిమా తీయబోతున్నాడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జులై రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.