‘ బాహుబలి 2 ‘ రికార్డు బ్రేక్ చేసిన సంజు..

బాక్స్ ఆఫీస్ దగ్గర సంజు సునామీ వసూళ్లు సృష్టించడమే కాదు పలు సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం లో తెరకెక్కిన సంజు జూన్ 29 న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. రణబీర్ కపూర్ సంజయ్ పాత్ర లో రణబీర్ నటించాడు. ప్రీమియర్ షోస్ తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కుమ్మేస్తున్నాడు.

తాజాగా బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది ఈ మూవీ. ఆదివారం ఒక్కరోజే ఈ మూవీ రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇంతకుముందు ‘బాహుబలి-2’ రూ.46.5 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేస్తే తాజాగా ‘సంజు’ ఆ రికార్డును క్రాస్ చేసింది. ఇక మూడు రోజులకు గాను ఈ చిత్రం రూ.120 కోట్లను ఖాతాలో వేసుకుంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను నెలకొల్పడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధిస్తుంది. ముఖ్యం గా మల్టిఫ్లెక్స్ థియేటర్స్ లలో ఎక్కువగా సంజు చిత్రాన్నే చూసేందుకు పోటీపడుతున్నారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే…

సంజయ్ దత్ తన జీవితంలో చేసిన పొరపాట్లను, పదే పదే చేసిన ఆ తప్పులను యథాతథంగా చూపించి, అతడు నష్టపోయిన జీవితం గురించి… డ్రగ్స్‌కు బానిసై తన జీవితంలోని కొన్ని సంవత్సరాలను చీకటిమయం చేసుకున్న వైనాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించాడు హిరాని. ఫస్ట్ హాఫ్ డ్రగ్స్ సంజయ్ దత్ జీవితాన్ని ప్రభావితం చేసిన తీరును చూపించాడు. సెకండ్ హాఫ్ టాడా కేసులు, అండర్ వరల్డ్‌తో దత్ సంబంధాల గురించి డైరెక్టర్ తెలిపాడు.