ఆంధ్రప్రదేశ్ కు కొత్త పోలీస్ బాస్

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసిన ఆయన 1986 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి .ఆయన పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్.

డీజీపీ పదవి కోసం ఠాకూర్ తో పాటు గౌతమ్ సవాంగ్ , VSK కౌముది, NV సురేంద్రబాబు, AR అనురాధ ల పేర్లను కమిటీ ప్రతిపాదించింది. వీరిలో ముఖ్యంగా ఠాకూర్ తో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కూడా చివరి వరకు రేసులో ఉన్నారు.

ఆయన తొలిసారి 1986, డిసెంబర్ 19వ తేదీన జాతీయ పోలీస్ అకాడమీలో అదనపు ఎస్పీగా పదవి బాథ్యతలు తీసుకొన్నారు. ఆ తరువాత పాట్నాలో సీఐఎస్ఎఫ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వరంగల్‌, గుంటూరు జిల్లాల్లో ఏఎస్పీగా, ఆ తరువాత పశ్చిమగోదావరి, కృష్ణా, వరంగల్‌, కడప జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. విభజన తరువాత జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 సంవత్సరం నుండి ఆర్పీ ఠాకూర్ అవినీతి నిరోధక శాఖకు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయతి గల ఆఫీసరుగా ఆర్పీ ఠాకూర్ కు మంచి పేరు ఉంది.

ఉత్తమ పోలీస్ ఆఫీసరుగా పురస్కారాలు అందుకున్నారు ఆర్పీ ఠాకూర్ గారు ,అదీకాక 2003లో ఇండియన్ పోలీస్ మెడల్, 2004లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించిన ఠాకూర్, 2011లో భారత రాష్ట్రపతి చేతులు మీదుగా మెడల్ కూడా అందుకున్నారు.