మళ్ళీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయా ?

అవునండి ప్రజల భాధను అర్థం చేసుకొని మన ప్రభుత్వం గత కొన్ని రోజులుగా పెట్రోల్ , డీజిల్ రేట్లను అతి కష్టం మీద రోజుకో పైసా చొప్పున తగ్గించుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజల కు మళ్ళి చుక్కలు చూపించడానికి రెడీ అవుతుంది. అంటే మళ్ళి పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగనున్నాయి అన్నమాట.

ఎందుకంటే త్వరలో అట్లాంటిక్ మహా సముద్రంలో హరికేన్లు ప్రారంభమైతే దేశంలో ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారట . గత సంవత్సరం హరికేన్లు ప్రభావం వల్ల అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం పడిపోవడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి . గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అట్లాంటిక్ మహా సముద్రంలో హరికేన్లు ప్రారంభమైతే ఇంధన ధరలు భారీగా పెరగచ్చు అని నిపుణులు చెపుతున్నారు.

ఈ విధంగా రేట్లు పెంచుకు పోతే ప్రజలు వాహనాలు బదులు సైకిళ్ళు , ఎడ్లబండ్లు లేదా పాదయాత్ర వంటివి చేస్తారు, అంటే తాతల (1940) కాలానికి వెళ్తారు అన్నమాట .