ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం లో బీజేపీ కి ప్రతికూల పవనాలు వీస్తున్న కారణంగా వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎన్నికలను ఈ సంవత్సరం చివరన గాని లేదా అక్టోబర్ లో గాని నిర్వహించడం మంచిదని బీజేపీ నేతలు అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. వచ్చే నెల జూలై 18 నుంచి ఆగష్టు 10 వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలు ముగిసిన తరువాత ఎన్నికలు కోసం కేంద్రం ఒక నిర్ణయానికి రానుంది.
ఒకవేళ ముందస్తు ఎన్నికల కోసం నిర్ణయం తీసుకొంటే భారత ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకొని , ఆయా రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలను తిరస్కరిస్తే చేసేది ఏమిలేదని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. ఒకవేళ అన్ని రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు అంగీకరిస్తే ఎన్నికల సంఘం సెప్టెంబరులోనే ఎన్నికల షెడ్యూలు మరియు ఆ వెంటనే నోటిఫికేషన్ ప్రకటించే ఆవకాశం ఉంది.ఇక అన్ని జరిగితే ఈ సంవత్సరం లోనే మనం కొత్త ప్రభుత్వాలను చూడవచ్చు .