మార్కెట్ లో మణిరత్నం కడలి

Kadali Telugu Movieమణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘కడలి’ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో
నేరుగా మార్కెట్లోకి నిన్న విడుదలైంది. ఫంక్షన్ నిర్వహించి ఆడియో విడుదల
చేయాలని అనుకున్నప్పటికీ…చివరి నిమిషయంలో మనసు మార్చుకున్న నిర్మాతలు పాటల పండగ లేకుండానే డైరెక్టర్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈచిత్రానికి మ్యూజిక్ మాంత్రికుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఆడియో ట్రాక్ లిస్ట్:

1. చిట్టి జాబిల్లి…
2. యాడికే…
3. పచ్చని తోట..
4. ఎల్లే జెల్లే..
5. గుంజుకున్న.,.
6. మమతె నవ్వెలే..
7. మగిడి మగిడి..
దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కడలి చిత్రాన్ని ఫిబ్రవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ  చిత్రం ద్వార తమిళ హీరో కార్తీక తనయుడు గౌతమ్, హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి తెర కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.