ప్రపంచ తెలుగు పండగ ప్రారంభం

world-telugu-conference-thiరాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అధ్యక్షోపాన్యాసం చేశారు. తెలుగు మహాసభల సందర్భంగా ప్రపంచంలోని తెలుగు వారందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహాసభలను ౩౭ సంవత్సరాల తర్వాత నిర్వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. మాతృ భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలుగును పాలన, భోధన భాషగా అమలు చేస్తామని వెల్లడించారు. సంగీత, సాహిత్య, లలిత కళల అకాడమీలను పున: ప్రారంభిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. దాదాపుగా ౭౦౦ మంది పోలీసులతో ప్రధాన వేదిక దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. అతిథులకోసం అచ్చతెలుగు వంటకాలను వండించనున్నారు. మూడురోజుల పాటుగా ఈ సభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభల్లో అనేక తీర్మానాలు ఆమోదిస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు.