రెండు సినిమాలపై యమనమల కౌంటర్

ఏపీ మంత్రి యనమల, జగన్ చేసిన రెండు సినిమాలు కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు. అమరావతి, పోలవరం రెండు సినిమాలు అంటూ జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి యనమల మండిపడ్డారు. ఏపీ సమస్యల పట్ల, ఏపీ ప్రజల ఆకాంక్షల పట్ల జగన్ కు ఇసుమంతైనా అవగాహన లేదని విమర్శించారు. సినిమా వ్యాఖ్యలపై జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ, జనసేన లపై యనమల విమర్శలు సంధించారు. ప్రధానికి కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్లపై ఎందుకు పేర్కొనలేదని యమనమల ప్రశ్నించారు. వైసీపీ, జనసేన, భాజాపా వేర్పాటు విధానాలని అనుసరిస్తున్నాయని విమర్శించారు.