హస్తినలో అర్దరాత్రి ఆడపడుచు దైన్యం !
ఏమైపోయిందో ఏమో మన్మోహన సైన్యం !!
లేదయ్యా భారతాన కీచకులకు కొదవ !
సిగ్గు శరము హ్యుమానిటీ పెట్టేసేయ్ కుదువ !!
రాజధాని నడిబొడ్డున జాతి పరువు దగ్ధం !
షీలా సోనియ సాక్షిగ మహిళల ఏడుపు శబ్దం !!
ముద్ద ఎలా దిగుతోందీ భారతి ఏడుస్తుంటే !
నెత్తురెలా ఊరుకుంది తల్లులు రోదిస్తుంటే !!
– ఏవీయస్