‘ఠీక్ హై’ కు 5గురు సస్పెన్షన్..!

manmohan-singhప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి సోమవారం సమయానికి చేరుకోనందుకు దూరదర్శన్ ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సంఘటనపై దర్యాప్తునకు కూడా ఆదేశించింది. దూరదర్శన్ కు చెందిన ముగ్గురు సిబ్బంది, ఇద్దరు కెమెరామెన్లు సమయానికి చేరుకోలేకపోవడంతో అక్కడే ఉన్న ఏఎన్ ఐ ఏజెన్సీ ప్రధాని ప్రసంగాన్ని రికార్డు చేసింది.

అయితే అసలు కారణం మాత్రం అదికాదట..! ప్రధాని ప్రసంగాన్ని సరిగా ఎడిట్ చేయకుండా వాడడంతో చివరతో ప్రధాని మాట ఠీక్ హై ప్రసారమైందని, దూరదర్శన్ లో ప్రసారం జరిగిన తరవాత మరో 44 ఛానెల్లలో ప్రసారం జరగడం జరిగింది. దీంతో ప్రధాని కార్యకార్యాలయం ఈ చర్యలకు పాల్పడిందని సమాచారం.

‘ఠీక్ హై’ప్రాసారం.. నేపథ్యంలోనే సిబ్బందిపై వేటు వేశారన్న వార్తల్ని దూరదర్శన్ ఖండించింది. ప్రధాని వద్దకు 9.30 కి చేరుకోవలసిన సిబ్బందిలో ఇద్దరు 9.40 కి చేరుకోగా మరో ముగ్గురు 10 గంటల తర్వాత చేరుకున్నారని దూరదర్శన్ అధికారులు పేర్కొన్నారు. అప్పటికప్పుడు ప్రధాని ప్రసంగం షెడ్యూల్ ఖరారు కావడంతో సమయానికి చేరుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్లు అధికారులు తెలిపారు. మరీ ఏదిఏమైనా..ప్రధాని  ‘ఠీక్ హై’ అనే మాట ఐదుగురి సస్పెన్షన్ కు కారణమైందన్న మాట!