ప్రజాగ్రహం సబబే : నితీష్

nithish-kumarదేశంలో అత్యాచార ఘటనలను నిలువరించాలంటే నేరగాళ్లను కఠినంగా శిక్షించేలా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటం ద్వారా నేరస్తులకు వెంటనే శిక్షపడేలా చేయవచ్చని పలువురు సూచిస్తున్నారు.

అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ దుర్ఘటనపై స్పందిస్తూ.. “ఢిలీలో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం సరైనదే. సహజమైనదే. హీనమైన ఆ చర్యపై వ్యక్తమవుతున్న ప్రజాందోళనలో ఎన్నో సానుకూల అంశాలున్నాయి. సామాజిక రుగ్మతలను తొలగించటానికిది దోహదపడుతుంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో సత్వర న్యాయవిచారణ జరిపి తీర్పులు వెలువరించటం వల్ల నేరాలు అదుపులోకి వస్తాయి. బీహార్ లో చాలా నేరాలకు ఇలాగే అడ్డుకట్టపడింది” అని తెలిపారు.