ఢిల్లీ ఆందోళనలు దేశాగ్రహానికి ప్రతిబింబం

Pranab-praises-gang-rape-victimఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భాజపా నేతల రెండు సూచనలనూ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఎల్ .కే. అద్వానీ నేతృత్వంలో సుష్మాస్వరాజ్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించింది. అయితే రాష్ర్టపతి స్పందనపై భాజపా నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ఆందోళనతో ఆయన పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. భేటీ అనంతరం ఎల్.కె. అద్వానీ మాట్లాడుతూ.. ఢిల్లీ ఆందోళన దేశం మొత్తం ఆగ్రహానికి ప్రతిబింబమనే భావనలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఉండటంపై తాము సంతోషిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే కాదనీ, రాజకీయ వర్గాల వైఫల్యం కూడా అనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. మేము హోంమంత్రి షిండే కలిసి రెండు సూచనలనూ నేపథ్యంలో .. ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సినంత అవసరం తనకు కనిపించడం లేదని, ఇప్పుడిప్పుడే పరిస్థితి చల్లబడుతోందని, అవసరం అయినప్పుడు చూస్తామని షిండే అనడం భాధాకరం అని తెలిపారు. ప్రతినిధి బృందంలో నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు ఉన్నారు.
అంతకుముందు… భాజపా కోర్ బృందం, పార్టీ ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు. మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు, హింసపై ప్రజల్లో పెల్లుబకుతున్న ఆగ్రహావేశాలపై చర్చించారు. ఈ అంశాన్ని రాష్ర్టపతి దృష్టికి తీసుకెళ్ళాలని పార్టీ నిర్ణయించింది. మరోవైపు మహిళల రక్షణపై ప్రధాని చేసిన ప్రకటన భరోసా ఇవ్వలేకపోయిందని భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు.