“నాయక్” సెట్ లో ‘చిరు’ సందడి

charmi and chiruచిరంజీవి గతంలో ‘జంజీర్’ సినిమా షూటింగ్ సమయంలో సెట్ లోకి వెళ్లి అందరిని ఆనందాశ్చర్యాలకు గురిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నాయక్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా చిరు అకస్మాత్తుగా సెట్ లోకి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. చిరు అక్కడికి వచ్చినప్పుడు చరణ్ – ఛార్మి జంటపై
ఐటంసాంగును చిత్రీకరిస్తున్నారు. ”నెల్లూరే …” అంటూ సాగే ఐటంసాంగు చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులను ఉత్సాహపరిచారు మెగాస్టార్ . ఈ విషయాన్ని గురించి చార్మీ మాట్లాడుతూ, తాను చరణ్ తో కలిసి స్టెప్పులు వేయడం … ఆ సమయంలో చిరంజీవి వచ్చి అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పింది. నాగార్జున డమరుకం లో ‘సక్కు బాయి’ చార్మి ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో నాయక్ లో ‘నెల్లూరే’.. సాంగ్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9, 2013న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా…. అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు.