రిటైర్మెంట్ ప్రకటించిన సూపర్ స్టార్ కృష్ణ

krishnaహీరో కృష్ణ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. తెలుగు చిత్ర సీమను కొన్నేళ్ల పాటు సూపర్ స్టార్ గా ఏలిన హీరో కృష్ణ, తన నట జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక సినిమాలలో నటించే ఓపిక తనకు లేదనీ, అందుకే నటనకు స్వస్తి చెబుతున్నాననీ ఆయన తెలిపారు. హైదరాబాదులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ తన రిటైర్మెంట్ గురించి పైవిధంగా స్పందించారు. అలాగే, సినిమాలతోపాటుగా రాజకీయాలకు కూడా తాను దూరంగా ఉంటాననీ ప్రకటించారు. ‘నా ఆరోగ్యం వీటికి సహకరించదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని చెప్పారు. సినిజీవితంలో తన కోరికలన్నీ తీరినా… ‘ఛత్రపతి శివాజీ’గా నటిస్తూ, సినిమా నిర్మించాలన్న తన చిరకాల కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందని ఈ సందర్భంగా కృష్ణ అన్నారు.

తన అన్ని చిత్రాలకెల్లా ‘గూఢచారి 116’ సినిమా మహేష్ బాబుకి ఎంతో ఇష్టమని కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తన గ్లామర్ గురించి చెబుతూ, “నేను పరిమితంగా ఆహారం తీసుకుంటాను. నాకు చేపల కూర అంటే ఎంతో ఇష్టం… ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తాను అన్నారు’. అయితే, ఆయన శ్రీమతి విజయనిర్మల మాత్రం ఇకపై కూడా తాను సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పడం విశేషం!