సక్సెస్ మీట్ వాయిదా..

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండేళ్ల తర్వాత మహేష్ హిట్ కొట్టడం తో అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.

ఈ నేపథ్యం లో చిత్ర నిర్మాత దానయ్య సినిమా సక్సెస్ మీట్ ను ఈ నెల 27 తిరుపతి లో గ్రాండ్ చేయాలనీ ప్లాన్ చేసాడు కానీ ఇప్పుడు సక్సెస్ మీట్ తేదీ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. భారతీయ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఆ తేదీల్లో ఎక్కువగా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం మరియు తుఫాను పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం తో రిస్క్ వద్దని మరొక ప్లేస్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారట. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని దానయ్య తెలుపనున్నాడని సమాచారం.