కాలా టెలికాస్ట్ రైట్స్ ఎవరికో తెలుసా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే అభిమానులు సంబరాలు చేసుకుంటుంటారు. ముఖ్యం గా తమిళనాట ఓ పండగల భావిస్తారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. ప్రస్తుతం రజని నుండి రాబోతున్న చిత్రం కాలా. కబాలి ఫేమ్ పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయ్యింది.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎవరూ ఊహించని భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. అలాగే చిత్ర ప్రసార హక్కులను విజయ్ టివి ఛానల్ అత్యధిక ధరకు దక్కించుకుందట. రజని కెరియర్ లోనే అత్యధిక ధర పలికిన చిత్రం గా కాలా నిలిచిందని తమిళ్ వర్గాలు చెపుతున్నాయి. ఈ మూవీ లో రజని సరసన హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుండగా, హీరో ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.