లోకనాయకుడిగా గుర్తింపు పొందిన సినీ నటుడు కమల్ హాసన్…తాజాగా తన పార్టీ సమావేశం లో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. పార్టీ సమావేశం లో భాగంగా మీడియా కాస్టింగ్ కౌచ్ గురించి అడుగగా.. ఇక్కడ దీనిపై చర్చించడం సరికాదన్నారు. తమిళనాడును సరికొత్తగా మార్చబోతున్నామని… ఇక్కడ ఇలాంటి అంశానికి అంత ప్రాధాన్యత లేదన్నారు.
సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకమని, కాస్టింగ్ కౌచ్‌ను తిప్పికొట్టే హక్కు ప్రతి మహిళలకు ఉందన్నారు. కాస్టింగ్ కౌచ్‌కు అనుకూలంగా ఏ మహిళ మాట్లాడటం పద్ధతి కాదని కమల్ తెలిపాడు. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ సంచలన వాక్యాలు చేసిన సంగతి తెల్సిందే. కాస్టింగ్ కౌచ్ అనేది ఉండాల్సిందేనని , దీని వల్ల కొంతమందికి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.