కాస్టింగ్ కౌచ్ ను ఎంకరేజ్ చేస్తున్న కొరియోగ్రాఫర్‌..

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది చాల కామన్..ఇది ఈ నెలలో మొదలయింది కాదు ఎప్పటినుండో వస్తుందిదే..కాకపోతే ఇటీవల శ్రీ రెడ్డి ద్వారా కాస్త ఎక్కువగా జనాలకు తెలిసింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ లేకపోతే చాలామందికి అవకాశాలు వచ్చేవి కాదని , కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీ కి మంచిదే అని తెలిపింది కొరియోగ్రాఫర్‌ సరోజ్ ఖాన్.


తాజాగా ఓ కార్య క్రమం లో పాల్గొన్న బాలీవుడ్‌ సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మీడియా ప్రశ్నించగా..సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉండాల్సిందే..దీని వల్ల కొందరికి కనీసం తిండి దొరుకుతుందని తెలిపింది. అయితే, ఇలాంటి వ్యవహారలకు సిద్ధపడాలా, వద్దా అనే నిర్ణయం పూర్తిగా అమ్మాయిలదేనని అభిప్రాయపడ్డారు.