భరత్ అనే నేను పబ్లిక్ టాక్ ..

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ట్రైలర్స్ , ఆడియో తో సినిమా ఎంత క్రేజ్ రావాలో అంత వచ్చేసింది. మహేష్ నటించిన గత రెండు చిత్రాలు అభిమానులను నిరాశ పరచడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు..ఇక అంచనాలను అందుకోవడం లో భరత్ సక్సెస్ అయ్యాడని అభిమానులు చెపుతున్నారు.

రెండేళ్ల దాహాన్ని మహేష్ ఒక్క సినిమాతో తీర్చాడని , మాకు కావాల్సి ఇదేనని , మహేష్ ను ఎలా చూడాలనుకున్నామో..ఆయన నుండి ఎలాంటి సినిమా రావాలనుకున్నామో అదే ఈ భరత్ అనే నేను అని ఫ్యాన్స్, పబ్లిక్ చెపుతున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ఇరగదీశాడని.. ఫస్టాఫ్‌, సెకండాఫ్ అని కాకుండా ఓవరాల్‌గా ‘భరత్ అనే నేను’ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెపుతున్నారు. ఇంటర్వెల్ పెద్దగా మలుపులు లేకుండా ఉన్నప్పటికీ , ఇలాంటి కథకు ఎక్కడ ఎలాంటి మలుపులు పెట్టాలో అదే పెట్టారని అంటున్నారు. ఈ చిత్రం తో మహేష్ కు ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమని , మరోసారి ఈ మూవీ కి అవార్డుల పంట రావడం ఖాయమని ఫ్యాన్స్ చెపుతున్నారు.