క్షేమించండి అంటే సరిపోతుందా వర్మ ..

రామ్ గోపాల్ వర్మ..ఈ పేరు చెపితేనే ఎవరికైనా వివాదాలే గుర్తుకొస్తాయి..ఏదో వివాదం సృష్టించి దాని ఫై పబ్లిసిటీ చేసుకోవడం వర్మ కు అలవాటు. ఇది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో వస్తుందే..తాజాగా అలాంటి వివాదమే సృష్టించి ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు.

ఇటీవల శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫై అలాగే ఆయన తల్లి ఫై అభియోగాలు చేసి వార్తల్లో నిలిచినా సంగతి తెల్సిందే. దీనికి మూలకారణం రామ్ గోపాల్ వర్మ నేనని బయట పడడంతో అందరూ ఆయన్ను విమర్శించడం స్టార్ట్ చేసారు. అయితే దీనికి సారీ అంటూ , నేను చేసింది క్షమించరాని తప్పే. అరవింద్‌కు, పవన్‌కు, ఫ్యాన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. మళ్లీ ఎప్పుడూ పవన్‌ మీద, అరవింద్‌ కుటుంబ సభ్యుల మీద నెగిటివ్‌ కామెంట్స్‌ పెట్టను అని వర్మ తన పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.

కానీ అభిమానులు మాత్రం వర్మ సారీ ని స్వీకరించడం లేదు..చేసిందంతా చేసి ఇప్పుడు సారీ అంటే సరిపోద్దా..నువ్వు చేసిన ఎదవ పనికి అభిమానులంతా ఎంత బాదపడ్డారో తెలుసా..ఆ తల్లి ఎంత బాదపడిందో తెలుసా..అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారీ చెప్పిన కుదరదని , వెంటనే ఆయన్ను టాలీవుడ్ నుండి బ్యాన్ చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.