హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో మరో ఘనతను సాధించారు. ఇటీవల ‘జులాయి’ చిత్రంతో ఘన విజయం సాధించిన ఈ స్టైలిశ్ స్టార్ ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ఫేస్బుక్ తో ఓ మైలురాయి చేరుకున్నాడు. బన్నీ ఫ్యాన్ పేజ్లో చేరిన అభిమానుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. ఏ ఇతర తెలుగు హీరో కన్నా అందరు తెలుగు హీరోల ఫేస్ బుక్ పేజీల్లో లైక్ చేసిన అభిమానులందరి కౌంట్ కంటే ఇది ఎక్కువట. తెలుగులోనే కాకుండా మళయాళం సినిమా ఇండస్ట్రీలోనూ బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే! అలాగే దాదాపుగా అల్లు అర్జున్ నటించే అన్ని తెలుగు సినిమాలు కేరళలో డబ్ అయి రిలీజ్ అవడం, అక్కడ మంచి విజయాలు సాధించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో…’ అనే సినిమాలో ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీనా ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు.