ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

rape-teargasదేశరాజధానిలో చోటుచేసుకున్న అత్యాచారం ఘటనకు నిరసనగా ఇండియా గేటు వద్ద ఉదయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇండియా గేట్ వద్దకు వేలాది సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం రాష్ర్టపతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఆందోళకారులు పోలీసు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై జల ఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించి చెదరగొట్టారు. లాఠీఛార్జీ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.