నా లిమిట్స్ తెలుసు: సాయి పల్లవి

మొదటి సినిమా ఫిదాతో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొంది.. రెండో సినిమా ఎంసీఏతో టాప్ హీరోయిన్ లీగ్ లోకి ఎంటరైపోయింది ట్రెడిషనల్ బ్యూటీ సాయి పల్లవి. ఆమె టాప్ హీరోయిన్స్ కు ఛాలెంజ్ అని కొందరు వ్యాఖ్యనిస్తున్నారు అయితే తనకు ఈ పోటి లేదని చెబుతుంది సాయి పల్లవి.

”సినిమా పరిశ్రమలో ఎవరినీ నేను పోటీగా భావించడం లేదు. నటీమణులంతా నాకు మంచి స్నేహితులే. నా బలం, బలహీనతలు నాకు బాగా తెలుసు. అన్ని రకాలైన పాత్రలు నాకు నప్పవు. అందువల్ల నా హద్దులు నాకు తెలుసు” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి కణం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా తమిళ్ లో సూర్య సరనస ఒక సినిమా చేస్తుంది సాయి పల్లవి.