108లో వైఎస్ జగన్.. !

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 108లోకి అడుగుపెట్టాడు. అలాగని ఆయన ఆరోగ్యం బాగూలేదు అనుకొనేరూ.. ! గత కొద్దికాలంగా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా సంకల్ప యాత్ర’ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ యాత్ర 108వ రోజుకు చేరుకొంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరుగుతోంది. నేడు జగన్ తన పాదయాత్రని సంతరావూరు శివారు నుంచి ప్రారంభించారు.

పాదయాత్ర అంబేద్కర్‌నగర్‌, వేటపాలెం, దేశాయ్‌పేట, జాండ్రపేట, రామకృష్ణాపురం మీదుగా చీరాల వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సాయంత్రం చీరాల క్లాక్‌ టవర్‌ సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.

మరోవైపు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడిపెంచేందుకు వైసీపీ ఇప్పటికే ప్రణాఌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఎంపీల రాజీనామా ఉంటుందని చెబుతున్నారు. ఇక, టీడీపీ కేంద్రంపై అంచెలంచెలుగా పోరాటానికి ప్రణాఌకని సిద్ధం చేసుకొంటోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవులకి సుజనా, ఆశోక్ గజపతి రాజులు రాజీనామా చేయడం.. వాటిని స్వీకర్ ఆమోదించడం జరిగిపోయిన సంగతి తెలిసిందే.