నితిన్ ‘పెద్దపులి’ సాంగ్ అదుర్స్


నువ్ పెద్దపులి.. నువ్ పెద్దపులి.. అంటూ ఊరమాస్ బీట్ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న‘ఛల్‌ మోహన్‌ రంగ’ మూవీ నుండి ‘పెద్దపులి’ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఈ జాతర సాంగ్.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేదిగా ఉంది.
ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.