ఏపీ బడ్జెట్ 2018: ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్‌

2018-19 బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11.30గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ మొత్తం రూ.1,96,800కోట్లుగా ఉండనుంది.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, పేద ప్రజల అభ్యున్నతికి పోరాడే పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. విభజనతో నష్టపోయినందున ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని, విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సినవి కేటాయించాలని అడిగామన్నారు. విభజనతో నష్టపోయినందున కేంద్రం సాయం కోరుతున్నామన్నామని, మూడేళ్లుగా చూస్తే బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఖర్చ పెట్టిన సందర్భాలు లేవన్నారు.