నో డౌట్.. సాయిపల్లవితో ఆ హీరోకి చెడింది

ఎంసిఎ సినిమా షూట్ టైమ్ లో హీరో నానికి హీరోయిన్ సాయిపల్లవికి పొసగలేదని వార్తలు వచ్చాయి. అదంతా వట్టిదే అని, అవన్నీ గ్యాసిప్ లు అనీ కొట్టి పారేశారు. ఇప్పుడు సాయి పల్లవి పై మరో ఫిర్యాదు. ఎఎల్ విజయ్ డైరక్షన్ లో ఓ తమిళ సిన్మాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కీలకం అని సాయి పల్లవిని తీసుకున్నాడు ఎఎల్ విజయ్. నాగశౌర్య హీరో. ఇప్పుడు నాగశౌర్యతో కూడా సాయి పల్లవికి ఎక్కడో తేడా కొట్టింది.

ఈ విషయం మరోసారి రుజువైయింది, హీరో లేకుండానేఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగిపోయింది. ఈ సినిమాకు సంబంధించి యూనిట్ ఎక్కువగా సాయిపల్లవికే ప్రాధాన్యం ఇస్తుందనే ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చింది. హైదరాబాద్ లో ఉండి కూడా ఫంక్షన్ కు వెళ్లలేదు నాగశౌర్య.దీంతో వీరి మధ్య ఎదో సంథింగ్ తేడా కొట్టేసిందని అర్ధం చేసుకోవచ్చు.