సూర్య .. ‘చే గువేరా’ గెటప్ ఏంటో ?


హీరో సూర్య, సెల్వ రాఘవన్‌ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నిన్న సెల్వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీన్ని సూర్య ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ప్రియమైన మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ కావాలి. దర్శకుడు సెల్వ రాఘవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రానికి ‘ఎన్‌జీకే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌లో సూర్య చాలా విభిన్నంగా కనిపించారు. ఆయన లుక్ పోరాటయోధుడు ‘చే గువేరా’ని పోలివుండటం విశేషం. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రభు సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.