వైన్ షాప్ లో వర్మ

Drink and read book on RGVప్రముఖ సినీ విమర్శకుడు, గీత రచయిత సిరాశ్రీ రామ్ గోపాల్ వర్మ మీద రచించిన “వోడ్కా విత్ వర్మ” పుస్తకం భాగ్యనగరంలో ఊహించని ప్రదేశాల్లో దొరుకుతుంది. గత వారం విడుదలయిన ఈ పుస్తకం టైటిల్ పలు వైన్ షాప్ ఓనర్లను ఆకట్టుకున్నట్టు కనిపిస్తుంది. కొన్ని మద్యం దుకాణాలలో ఈ పుస్తకాన్ని అమ్ముతున్నారు… ఆశ్చర్యపోకండి ఇది నిజం. ఈ విషయం గురించి రాంగోపాల్ వర్మ చెబుతూ …
“వోడ్కా విత్ వర్మ పుస్తకాన్ని మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారట” అని ట్వీట్ చేశారు. గతంలో రామ్ గోపాల్ వర్మ రచించిన “నా ఇష్టం” పుస్తకానికి కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.