‘నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా.. మీరింకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు. చూస్తారు’అని వార్నింగ్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్,సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కాలా’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లోనిదే ఈ డైలాగ్.
ఇక టీజర్లో రజనీ స్టైల్, డైలాగులు, యాక్షన్ సీన్లు అలరించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీ..కరికాలన్ అనే డాన్ పాత్రలో నటించారు. టీజర్ లో విలన్ నానా పాటేకర్..‘కాలా..ఇదేం పేరు’ అంటాడు. అప్పుడు ‘కాలా అంటే నలుపు. కరికాలన్ అంటే గాడ్ ఆఫ్ డెత్. రక్షించడానికి పోరాడేవాడు.’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఆకట్టుకుంటోంది. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ రజనీకి జోడీగా నటించింది. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.