ఆడియో అదిరింది: మహేష్

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’  ఆడియో ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియోకు అద్భుతమైన రెస్సాన్స్ వస్తుండటంతో మహేష్‌ చాలా ఆనదంగా వున్నాడు. మంచి ఆడియో ను అందించిన సంగీత దర్శకుడు మిక్కిజే మేయర్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను అభినందిస్తూ … “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఆడియోకు ఔట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తోంది. బెస్ట్ మ్యూజిక్ అందించినందుకు మిక్కీజే మేయర్‌కు థాంక్స్. నా అభిప్రాయం ప్రకారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్బం ఓ మాస్టర్ పీస్. ఈచిత్రం, సంగీతం, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఇలా అన్నీ అద్భుతంగా రావడానికి కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తితో కలిసి పని చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నాను. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు” అంటూ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు.