శ్రీదేవి మృతితో నిలిచిపోయిన షూటింగులు

శ్రీదేవి కన్నుమూతతో టాలీవుడ్ , బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ తో పాటు ఈరోజు జరగాల్సిన పలు కార్యక్రమాలు కూడా రద్దు చేశారు. అమితాబ్-రిషికపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘102 నాట్ ఔట్’ చిత్రం షూటింగ్ రద్దు అయింది. లెజెండరీ నటి శ్రీదేవి అకాల మరణం తనను చాలా బాధించిందని, ఆమెకు సంతాపం తెలుపుతూ ఈరోజు జరగాల్సిన తమ సినిమా పాట షూటింగ్ ను రద్దు చేసుకున్నామని, శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని యూనిట్ చెప్పింది.

ఈ సినిమాతో పాటు ఇంకా పలు సినిమాల షూటింగ్ లు రద్దయినట్టు సమాచారం. తన భర్త జావేద్‌ అక్తర్‌ ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే హోలీ పండగను ఈ ఏడాది జరపడం లేదని నటి షబానా అజ్మీ తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన కొత్త సినిమా టైటిల్‌ విడుదలను వాయిదా వేశారు.