బాబు ‘రేపటి సాంకేతికతలు’ ప్రజంటేషన్ అదిరింది

విశాఖలో “నాలుగోతరం పారిశ్రామిక రంగం – భారత్ సామర్థ్యం” ప్లీనర్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘రేపటి సాంకేతికతలు’ అంశం పై ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో పాటు ” రియల్ టైమ్ గవర్నెన్స్” పై చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు. సాంకేతికత విషయంలో ఏపీ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ‘ఏస్ అర్బన్’ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏస్ అర్బన్ సంస్థ రాష్ట్రంలోని విశాఖపట్నంలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. “నాలుగోతరం పారిశ్రామిక రంగం – భారత్ సామర్థ్యం” ద్వారా ఏపీకి సాధ్యమైనన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకొన్నారు.