పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఒక వీడియో వీడియో షేర్ చేసింది తన జీవితంలో పాతుకుపోయిన జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయంటూ కొంచెం బాధ, ఇంకొంచెం ఆవేదన కలగలిపి ఆమె రాసుకున్న ఓ కవితతో కూడిన వీడియో ఇది.
‘నా మెమోరీస్ ని చూసుకుంటున్నాను. ఆ మాటలు, పదాలు, ఆ పేరు చెక్కిన కలం నా జ్ఞాపకాల్లో ఉన్నాయి. కానీ కమ్ముకున్న హిమం కరిగిపోయి మళ్లీ ఆ జ్ఞాపకాలు కళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బలీయమైనది. మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలన్నింటినీ మళ్లీ తట్టిలేపింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్కలైన హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కన్పించాయి’’ అంటూ తన వాయిస్ తో ఒక ఎమోషనల్ కవిత వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.