అహం బ్రహ్మాస్మి .. ఓ టాప్ హీరో కోసం ?


తొలిప్రేమతో హిట్టు కొట్టిన మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.. ఇప్పుడు ఘాజీ’ తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ‘మే నెల నుండి ఈ మూవీ ప్రారంభంకానుంది. అహం బ్రహ్మాస్మి అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఐతే ఈ టైటిల్ పై కొత్త కబురు వినిపిస్తుంది. ఇది దర్శకుడు క్రిష్ కోసమట. క్రిష్‌ ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారట. కొత్త రకమైన కథతో రూపొందనున్న ఆ చిత్రంలో ఒక స్టార్‌ కథానాయకుడు నటించబోతున్నారు. ప్రస్తుతం హిందీలో ‘మణికర్ణిక’ చేస్తున్నారు క్రిష్. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే, క్రిష్‌ తన తదుపరి తెలుగు చిత్రానికి సంబంధించిన పనుల్ని ఆరంభించారు. ఓ అగ్ర కథానాయకుడితో ప్రస్తుతం కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని టాక్.