బాలీవుడ్ నటుడు టైగర్‌ష్రాఫ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాఘీ 2’. అహ్మద్‌ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఐయింది. . ట్రైలర్లో మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఏకంగా ఎగిరి హెలికాప్టర్‌ను పట్టుకోవడం , నాలుగు తాపులు తంటే నాలుగు కాళ్లు విరిగిపోవడం, గన్నులతో విద్వంశం .. ఇలా చాలా వీరోచిత యాక్షన్ దృశ్యాలు వున్నాయి ఇందులో.
2016లో వచ్చిన ‘బాఘి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. బాఘి సినిమాను తెలుగులో వచ్చిన ‘వర్షం’ సినిమాకి రీమేక్‌గా తీసినా.. అందులో కేరళలో ప్రసిద్ధిచెందిన కళరిపాయట్టు నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు బాఘి-2 ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఓ చిన్నారి కిడ్నాప్ అవ్వడం చుట్టూ ఈ కథ తిరుగుతోంది . ‘బాఘి 2’ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.