బ్రహ్మానందం కంటతడి


గతకొంత కాలంగా కిడ్నీ, మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న హాస్యనటుడు గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున మరణించారు. కొన్నేళ్లుగా కిడ్ని సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స చేయించుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అలీ స్వయంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలీ చేసిన ఓ షో ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చేయూతనిచ్చింది. ఇటివలే డిస్ చార్జ్ ఆయన మళ్ళీ ఆరోగ్యం వికటించడంతో తుది స్వాశ విడిచారు.

హనుమంతరావుకు నివాళులు అర్పించేందుకు బ్రహ్మానందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

‘గుండు హనుమంతరావు చనిపోయారన్న నిజం నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నాకు హనుమంతరావుకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆయన చనిపోయారనగానే ఏదో తెలీని అలజడి. వెంటనే శివాజీ రాజాకు ఫోన్‌ చేశాను. చాలా సార్లు గుండు హనుమంతరావు ఇంటికి వెళ్లాను. వెళ్లిన ప్రతీసారి ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు. కల్మషం లేనిమనిషి’ అని కంటతడి పెట్టారు బ్రహ్మానందం