వర్మకు ఏడేళ్లకు జైలు శిక్ష ?


‘జీఎస్‌టీ’ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను సీసీఎస్‌ పోలీసులువిచారించారు. ఆయన ల్యాప్‌టాప్‌ సీజ్‌ చేశారు. తదుపరి విచారణకు శుక్రవారం రావాలని నోటీసు జారీచేశారు. సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మను విచారణకు పిలిచిన పోలీసులు ఈ రోజు సుమారు 4గంటలపాటు విచారించారు.

కాగా, రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసును ఆషామాషీగా విచారించలేమని, టెక్నికల్ గా చాలా ఆధారాలను సేకరించాల్సి ఉందని ఒకవేళ వర్మ దోషిగా తేలితే, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనిచెప్పారు.గతంలో కూడా ఇలాంటి కేసుల్లో 50 శాతం రుజువయ్యాయని., విచారణకు వర్మ పూర్తిగా సహకరించారని, ఆయనను అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.