ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైడ్డింగ్ కమిటీని కొందరు జస్ట్ ఫర్ ఫన్ కమిటీ అంటూ ఎద్దేవ చేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ టైం పాస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాడు అంటూ కొందరు ఎద్దేవ చేశారు. అయితే ఏపీ ప్రజలు మాత్రం పవన్ ఏర్పాటు చేసిన కమిటీ వల్ల ఏదో జరుగుతుందని భావించారు. రెండు రోజుల పాటు ఏపీ మేధావులు మరియు పలువురు పార్టీ నాయకులు కలిసి హైదరాబాద్‌లోని ఒక హోటల్లో భేటీ అయ్యారు.
లెక్కలు తేల్చే పని అంటూ వారు ఈ కార్యక్రమంను ముందు వేసుకున్నారు. ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు కేటాయించాల్సి ఉండగా, ఎన్ని నిధులు కేటాయించింది, ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కావడం లేదు, ప్రత్యేక ప్యాకేజీ వల్ల వచ్చింది ఏంటీ అనే విషయాలను తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారంను కోరారు. నేడు కూడా అదే విషయమై చర్చించారు.
ఇక ఈ చర్చల్లో పాల్గొన్న కొందరు అప్పుడే ఈ కమిటీ వల్ల జరిగేది ఏమీ లేదని తేల్చి పారేశారు. తమపై ఆశలు పెట్టుకోవదని స్వయంగా జేపీ వంటి వారు ప్రకటించడంతో అంతా కూడా అవాక్కయ్యారు. కత్తి మహేష్ అన్నట్లుగా ఇది నిజంగానే జస్ట్ ఫర్ ఫన్ కమిటీనేనా అంటూ ఏపీ ప్రజలు కూడా నిటూర్చుతున్నారు.