అంజలితో ఆడుకున్న మహేష్ బాబు

మహేష్ బాబు చాలా సరదాగా ఉంటారని, సెట్లో వుంటే… అందరినీ ఆట పట్టిస్తారని…. మహేష్ తో పని చేసిన వాళ్ళు చెబుతుంటారు. ఆ మాట ఎంత నిజమో… మరో మారు నిరూపితమయ్యింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో వేడుక అందుకు సాక్షిగా నిలిచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ‘సీతమ్మ…’ పాటల వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అంజలి వేదికపై మాట్లాడుతూ ఈ సినిమాలో సీతమ్మ తనే అనే సంగతి చెప్పిసింది. ‘ఈ విషయం చెప్పాలో, లేదో నాకు తెలియదు… కానీ ఈ సినిమాలో సీతమ్మ నేనే’ అని ఆ తరవాత నాలిక కరుచుకుంది. వేదిక దిగిన తరవాత నేరుగా మహేష్ బాబు దగ్గరకు వెళ్ళింది. “అరె… ఎంత పని చేసావ్? సీతమ్మ నువ్వే అని ఎవరు చెప్పమన్నారు? ఎందుకు చెప్పావ్?’ అని సీరియస్ గా మహేష్ క్లాస్ పీకే సరికి… పాపం అంజలి బిత్తర పోయింది. అంజలి దీన స్థితిని చుసిన మహేష్… ఆ తరవాత నవ్వేశారు. దాంతో…. అంజలి కుడా ఊపిరి పీల్చుకుని…. ప్రిన్స్ తో శ్రుతి కలిపింది.