కావేరి జలాల వివాదంలో కర్నాటకకు ఊరట

కావేరీ నదీ జలాల వివాదంలో కర్నాటకకు ఊరట లభించింది. కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. దశాబ్దాల పాటు సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

2007లో కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ ఆదేశాల ప్రకారం.. తమిళనాడుకు 192 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలున్నాయి. తాజాగా తమిళనాడుకు రావాల్సిన వాటాను సుప్రీంకోర్టు తగ్గించింది. శుక్రవారం వెలువరించిన తీర్పులో తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. దీంతో కర్నాటకకు ఊరట లభించినట్లయింది.