ఎమ్మెల్యేకు జైలు శిక్ష

2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేయడం జరిగింది. ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న మంత్రి వట్టి వసంత కుమార్‌పై చింతమనేని దాడి చేశాడు. ఆ సమయంలో చింతమనేనిపై పోలీసులకు వట్టి ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ఇన్నాళ్లకు తుది తీర్పు వచ్చింది. వట్టిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా దెంతలూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు.

భీమడోలు కోర్టు నేడు ఈ విషయమై తుది తీర్పు ఇవ్వడం జరిగింది. చింతమనేనికి ఆరు నెలల జైు శిక్షతో పాటు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెళ్లడి చేసింది. వట్టిపై దాడితో పాటు అదే సమయంలో ఎంపీ కావూరి సాంభశివరావుపై కూడా చింతమనేని దాడికి ప్రయత్నించాడు. చింతమనేనికి జైలు శిక్ష పడటంతో టీడీపీ వర్గాలు షాక్‌ అవుతున్నాయి. పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకున్నారు.