చిరంజీవి షాకైన వేళ


వరుణ్‌తేజ్‌ భిన్నమైన ప్రయాణం కొనసాగిస్తన్నాడు . ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్‌’ ఇలా వేటికవే ప్రత్యేకం. గతేడాది శేఖర్‌కమ్ములతో కలిసి ప్రేక్షకులను‘ఫిదా’ చేశాడు. ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకులను అలరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఈ సదంర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. నాపైనా, వెంకీపైనా నమ్మకంతో దిల్‌రాజుగారు ఈ సినిమాను తీసుకొచ్చారు. ఆయన లేకపోతే సినిమా లేదు. సినిమాపై వెంకీకి ఉన్న ఇష్టం, ప్యాషన్‌ ఇందులో కనపడతాయి. సినిమా చూసిన చిరంజీవి గారు ‘ఏంటి ఇది తీసింది కొత్త దర్శకుడా?’అని షాకయ్యారు. మాకు అదో పెద్ద కాంప్లిమెంట్‌’ అన్నారు వరుణ్