‘సైరా’ కోసం ఇళయరాజా? నిజమా ?

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ సినిమా సైరా ఫస్ట్ షెడ్యుల్ అయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యుల్ మొదలుపెడతారు. కాగా ఇప్పటి వరకు ఈసినిమాకు కీలకమైన మ్యూజిక్ డైరక్టర్ ఎవరు అన్నది తేలనే లేదు. ఎఆర్ రెహమాన్ అనుకుంటే, ఆయన అత్ప్పుకున్నారు. సినిమాకు ఆల్ ఇండియా లెవెల్లో వినిపించే, గుర్తింపు వున్న పేరునే యాడ్ చేయాలన్నది మెగాస్టార్ ఆలోచన. ఆ మధ్య అంతా కీరవాణి పేరు వినిపించింది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఇళయరాజా పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన ఇళయరాజాను చిరంజీవి కలిశారట. ఈ సందర్భంగా వీరి మధ్య ఈ చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. చిరు కెరీర్ లో ఇళయరాజా అదిరిపోయిన హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి తోడు ఇళయరాజా అంటే ఇంటర్నేషనల్ గా పేరు ప్రఖ్యాతలు వున్నాయి. ఇప్పుడు వీరి కలయిక కుదిరితే పెద్ద విశేషమే అవుతుంది.