రజనీ పెళ్లి సందడి !


తమిళ దర్శకుడు వైజీ మహేంద్ర కుమారుడు హర్షవర్థన్ పెళ్లి ఈరోజు తెల్లవారుజామున జరిగింది. ఈ వివాహా మహోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు హాజరయ్యారు. రజనీతోపాటు ఆయన సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్‌ పాల్గొన్నారు. లతకు మహేంద్ర బంధువు అవుతారు. ఈ పెళ్లిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేంద్ర తన సినీ ప్రయాణంలో దాదాపు 200 సినిమాల్లో నటించారు. పలు టెలివిజన్‌ సిరీస్‌లోనూ నటించారు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఆయనకు వరుసకు సోదరుడు .

ఇక రజనీ విషయాన్ని వస్తే.. కాలా’, 2.ఓ’ సినిమా షూటింగ్‌లు పూర్తి చేశారు. కాలా’ను ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. 2.ఓ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు.