రివ్యూ : తొలిప్రేమ..అందరికి నచ్చే ప్రేమ కథ…

టైటిల్ : తొలిప్రేమ (2018)
స్టార్ కాస్ట్ : వరుణ్ తేజ్ , రాశి ఖన్నా
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాతలు: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : ఫిబ్రవరి 10, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : తొలిప్రేమ – అందరికి నచ్చే ప్రేమ కథ…

గత ఏడాది ఫిదా మూవీ తో మెగా సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్..ఈ ఏడాది తొలిప్రేమ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ నిర్మించగా , రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా తొలిప్రేమ చిత్ర టైటిల్ ను తో ఈ మూవీ రావడం తో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.. వారి అంచనాలకు తగట్టే చిత్ర ట్రైలర్స్ , సాంగ్స్ ఉండడం తో రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ ఏర్పడింది. మరి సినిమా కథ ఏంటి..? తొలిప్రేమ టైటిల్ కు తగట్టు సినిమా ఉందా లేదా..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆదిత్య ( వరుణ్ తేజ్ ) ట్రైన్ జర్నీ లో వర్ష (రాశిఖన్నా) ను చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీ లో ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు..ఈ క్రమం లో ఒకర్ని ఒకరు ఇష్టపడతారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు విడిపోతారు..ఆ తర్వాత ఆరేళ్ల తర్వాత , ఆది లండన్‌లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అదే కంపనీకి వర్ష కూడా వస్తుంది. వర్ష మీద కోపంగా ఉన్నప్పటికీ కొద్దిరోజులకు మళ్ళీ ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. మరి వర్ష , ఆది ని ప్రేమిస్తుందా..లేదా..? ఇద్దరు విడిపోయే అంత సమస్యలు ఎందుకు వచ్చాయి..? అనేది మీరు స్క్రీన్ ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* వరుణ్ తేజ్ – రాశి ఖన్నా యాక్టింగ్

* మ్యూజిక్

* సినిమా ఫొటోగ్రఫీ

* ఫస్ట్ హాఫ్

మైనస్ :

* సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సాగదీత

* క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలతో అలరిస్తూ వస్తున్న వరుణ్ తేజ్..గత ఏడాది ఫిదా తో మెగా హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ మూవీ లో లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రేమించుకోవడం , ఆ తర్వాత విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. గత సినిమాలతో పోలిస్తే వరుణ్ నటన లో చాల తేడాలు కనిపించాయి.

* వర్ష రోల్ లో రాశిఖన్నా చాల బాగా నటించింది. ఆ రోల్ కోసం లావు పెరగడం , ఆ తర్వాత సన్నబడడం చేసింది. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ ఇదే అని చెప్పాలి. వరుణ్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా రాశి బాగా చేసి యూత్ ను ఆకట్టుకుంది.

* హీరో తల్లి పాత్రలో సుహాసిని నటన ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి బాగానే నటించాడు. హైపర్ ఆది పోషించిన కామెడీ లో రెండు, మూడు పంచ్‌లు బాగానే వర్కవుట్ అయ్యాయి.

* మిగతా నటి నటులు వారి వారి పరిధి మేరకు బాగానే చేసారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా థమన్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి..ఈ మధ్య ఈయన చేసిన ఆల్బమ్ లలో ఇదే బెస్ట్ అని చెప్పాలి. మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది. ముఖ్యం గా ‘అల్లసాని వారి’ అలానే ‘తొలిప్రేమ’ టైటిల్ సాంగ్‌ను బాగా చిత్రీకరించారు. ఈ రెండు పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. వర్షంలో వచ్చే ‘నిన్నిలా’ అనే పాత చాలా ప్లెజంట్‌గా అనిపిస్తుంది.

* జార్జ్ సి.విలియ‌మ్స్‌ సినిమా ఫోటోగ్రఫి సినిమాకు ప్రాణం పోసింది. వెంకీ డైలాగ్స్ సైతం బాగా పేలాయి.

* ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఇంకాస్త కత్తిరింపులు చేస్తే బాగుండేది.

* నిర్మాణ విలువలు కూడా చాల బాగున్నాయి. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తెర ఫై కనిపిస్తుంది.

* ఇక డైరెక్టర్ వెంకీ దగ్గరికి వెళ్తే..ఇతడికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించకుండా తెరకెక్కించారు. మొదటి చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఎంచుకొని , దానిని యూత్ హృదయాల్లోకి వెళ్లేలా తీసుకెళ్లడం లో సక్సెస్ అయ్యాడు. కథ పాతదే అయినప్పటికీ దానికి తగట్టు హీరో , హీరోయిన్ మధ్య ఫీల్ ను తీసుకొచ్చి దానికి కామెడీ జోడించి విజయం సాధించాడు.

చివరిగా :

ప్రేమించడం, ఆ తరువాత విడిపోవడం, ఆ విరహ వేదనను ప్రేమికులు అనుభవించడం లాంటి కథే ఈ తొలిప్రేమ. ప్రేమకథలను ఇష్టపడే వారు కచ్చితంగా ఈ సినిమాను ఇష్టపడతారు. మూడు కోణాల్లో సాగే ఈ కథ ప్రేక్షకులను కదిలిస్తుంది. డైరెక్టర్ పెద్దగా ఆర్భాటం చేయకుండా సింపుల్ కథని రాసుకొని , దానికి బలమైన ఎమోషన్ సన్నివేశాలు , రొమాన్స్ , కామెడీ , మ్యూజిక్ జోడించి ఆకట్టుకున్నాడు.

ఫస్ట్ హాఫ్ అంత కూడా హీరో , హీరోయిన్ మధ్య లవ్ , రొమాన్స్ తో సాగిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు విడిపోవడం , మళ్లీ కలుసుకోవడం ఆ తర్వాత మళ్లీ లవ్ స్టార్ట్ కావడం ఇవన్నీ కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. కాస్త క్లైమాక్స్ లో జాగ్రత్త తీసుకునే బాగుండు. ఓవరాల్ గా తొలిప్రేమ..అందరికి నచ్చే ప్రేమ కథ.