శర్వానంద్ సరసన హలో అమ్మాయి


వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు శర్వానంద్. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మాహానుభావుడు. అంతకుముందు వచ్చిన రన్ రాజా రన్ కూడా హిట్టే. ఇప్పుడు శర్వానంద్ సూపర్ ఫామ్ లో వున్నాడు. ప్రస్తుతం సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయ్యింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కళ్యాణి ప్రియదర్శిని నటించబోతోంది. మొదట నిత్య మీనన్ అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో కళ్యాణి ఎంపిక అయ్యింది. మర్చి మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శర్వానంద్ ఈ సినిమాలో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.